త్వరలో 76,578 ఉద్యోగాలకు నోటిఫికేషన్

February 07, 2019
img

కేంద్ర సాయుధ పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్‌, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటిబిపి, అస్సాం రైఫిల్స్ విభాగాలలో 76,578 ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు మీడియాకు తెలియజేసారు. వాటిలో 7,646 పోస్టులు మహిళలకు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన వాటిలో 54,953 కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. వివిద విభాగాలలో భర్తీ చేయబోతున్న ఉద్యోగాల సంఖ్య ఈవిధంగా ఉంటుంది. 

సీఆర్‌పీఎఫ్‌లో 21,566 పోస్టులు, బిఎస్ఎఫ్-16,984, ఎస్ఎస్బీ-8,546, ఐటిబిపి-4,126, అస్సాం రైఫిల్స్-3,076 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు తెలియజేశారు. కనుక రాష్ట్రంలో నిరుద్యోగులు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో గమనించుకుంటే మంచిది.       


Related Post