రాష్ట్రంలో లైన్(వి)మెన్ రెడీ!

February 02, 2019
img

విద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగాలలో ఇంతవరకు పురుషులే పనిచేస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి పనిచేయడం మహిళలకు ఇబ్బంది కనుక. కానీ మహిళలు కూడా ఇప్పుడు ఆ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. నిజామాబాద్‌లో జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలకు ఈసారి ఆరుగురు మహిళలు దరఖాస్తు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలలో మహిళలను తీసుకోకూడదనే నిబందన ఏమీ లేదు కనుక అధికారులు వారి దరఖాస్తులు స్వీకరించి పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు ఒక ఎత్తైతే, స్తంభం ఎక్కడం మరో ఎత్తుగా మారింది వారికి. ఆరుగురు మహిళా అభ్యర్ధులలో ఒక్క ఆమె మాత్రమే అవలీలగా స్తంభం ఎక్కగలిగింది. మగవారి కంటే అలవోకగా ఆమె చకచకా స్తంభం ఎక్కడాన్ని చూసి ముచ్చటపడిన అధికారులు ఆమెకు జూనియర్ లైన్ (వి)మెన్ ఉద్యోగానికి అర్హత సాధించినట్లు వెంటనే ప్రకటించారు. ఆమె పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటి లైన్ విమెన్ వచ్చేసింది కనుక ఇకపై ఎప్పుడైనా విద్యుత్ స్తంభాలపై మహిళలు కనిపిస్తే ఎవరూ కంగారుపడవద్దు.           

(ఫోటో: ఈనాడు సౌజన్యంతో) 

Related Post