గురుకుల పాఠశాలలలో 4,322 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ

January 29, 2019
img

రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలకు భోధన, భోదనేతర పోస్టులు కలిపి మొత్తం 4,322 పోస్టులు భర్తీ చేసుకునేందుకు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో 4,284 పోస్టులు గురుకుల పాఠశాలలకు, 38 పోస్టులు బీసీ గురుకుల సొసైటీకి కేటాయించింది. వాటిలో 3,717 పోస్టులు మాత్రమే శాస్విత ప్రాతిపదికన భర్తీ చేయాలని మిగిలిన 605 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసుకోవలసి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ పోస్టులన్నీ కూడా ఒకేసారి కాకుండా రాగాల నాలుగేళ్లలో విడతలవారీగా భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. మొదటివిడతలో 2,537 పోస్టులను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఏప్రిల్ 1 తరువాత భర్తీ చేసుకోవడానికి అనుమతించారు. మిగిలినవాటిలో 833 పిజిటి పోస్టులను 2020-21లో, 119 ఫిజికల్ డైరెక్టర్లు-2021-22లో, 833 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను 2022-23 సంవత్సరంలో భర్తీ చేసుకోవచ్చునని ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

4,322 పోస్టుల భర్తీ చేయడం సంతోషించదగ్గ విషయమే కానీ దానికి నాలుగేళ్ళ సమయం తీసుకోవడమే నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తుంది. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగయువత ఈ పోస్టుల భర్తీకు శిక్షణ తీసుకొని నోటిఫికేషన్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యోగాలభర్తీ అంశంపై తెరాస ప్రతిపక్షాల నుంచి గట్టి సవాలు ఎదుర్కొంది. కనుక ఇకనైనా వివిద శాఖలలో ఖాళీలను వీలైనంత వేగంగా భర్తీ చేస్తే నిరుద్యోగులు, వారిపై ఆధారపడున్నవారు సంతోషిస్తారు. 


Related Post