టీచరు పోస్టులు భర్తీకి సుప్రీం గడువు

January 22, 2019
img

రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాది ఉపాద్యాయ పోస్టులు ఖాళీలున్నప్పటికీ భర్తీ చేయడంలేదని, అలాగే ఇతర సిబ్బంది నియామకాలు, పాఠశాలలో మౌలికవసతుల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ జెకేరాజు అనే ఒక వ్యక్తి వేసిన పిటిషనుపై సోమవారం జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఫిభ్రవరి నెలాఖరులోగా రెండు రాష్ట్రాలలో ఉపాద్యాయపోస్టులు భర్తీ చేయాలని గడువు విదించింది. అలాగే పాఠశాలలో మౌలికవసతుల కల్పించాలని ఆదేశించింది. ఈ కేసుపై మళ్ళీ మార్చి మొదటి వారంలో విచారణ చేపడతామని తెలిపింది. అప్పటికి ఉద్యోగాల భర్తీ, మౌలికవసతుల కల్పన కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


Related Post