బీటెక్‌-ఏఐ కోర్సు ప్రారంభించిన ఐఐటి-హైదరాబాద్‌

January 18, 2019
img

ఇప్పటి వరకు బీటెక్‌లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు మాత్రమే లభిస్తున్నాయి. ఐఐటి-హైదరాబాద్‌ దేశంలో మొట్టమొదటిసారిగా బీటెక్‌-ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు) కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించబోతున్నట్లు ఐఐటీ-హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ తెలిపారు. ఇది కూడా ఇతర బీటెక్‌ కోర్సుల మాదిరిగానే నాలుగేళ్ళు ఉంటుంది. మొదటి బ్యాచ్ లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన 20 మందితో ఈ కోర్సును ప్రారంభిస్తామని ప్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ తెలిపారు.

యావత్ ప్రపంచంలో అమెరికాలోని ఎంఐటి మరియు కార్నెగీ మిలాన్ యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సును భోదిస్తున్నాయి. కనుక ఈ రంగంలో శిక్షణ అందించబోతున్న వాటిలో ఐఐటి-హైదరాబాద్‌ మూడవదిగా నిలుస్తుంది.  


Related Post