జూ.కార్యదర్శుల నియామకాలపై హైకోర్టు తాజా ఉత్తర్వులు

December 25, 2018
img

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియమింపబడుతున్న 9,335 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో అధికారులు నిబందనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నియమకాలు చేపడుతున్నారని, కనుక దీనిపై సంగ్ర విచారణ జరిగేవరకు నియామకాలను నిలిపివేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు బి.హరీశ్‌కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషను వేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నియామకాలను నిలిపివేయాలని కొన్ని రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జేపీఎస్‌ పోస్టుల భర్తీలో ఆ కేసుపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌.రామచంద్రరావు ప్రభుత్వానికి తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వీటిపై బుధవారంలోగా పూర్తి వివరాలతో సంధానం ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

1. రాష్ట్రస్థాయి, స్థానిక కేటగిరీ, రిజర్వేషన్ల కేటగిరీలను ప్రకటించాలి.

2. ఈ పరీక్షలలో పాల్గొన్న అభ్యర్ధులందరి మార్కులను హాల్ టికెట్లవారీగా టి.ఎస్.పి.ఎస్.సి. వెబ్ సైటులో ఉంచాలి. 

3. క్రీడల కోటలో అభ్యర్ధులను ఎంపిక చేశారా లేదా తెలియజేయాలి. 

4. ఈ ఉద్యోగాల భర్తీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్నీ వర్గాలకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్లు కల్పించారా లేక అంతకంటే ఎక్కువ శాతం ఇచ్చారా? తెలియజేయాలి. 

Related Post