నోటిఫికేషన్స్ వెలువడేనా...ఉద్యోగాల భర్తీ జరిగేనా?

September 08, 2018
img

ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ ఎప్పుడు వెలువడుతాయో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా ఇప్పుడే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ కూడా అమలులోకి రావడంతో దానితో అధికారులు అయోమయంలో ఉన్నట్లు సమాచారం. ఇంతవరకు పాత 10 జిల్లాలు లేదా 31 జిల్లాల ప్రకారం పోస్టులను సర్దేవారు. కానీ ఇప్పుడు వాటిని కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం సర్ధుబాటు చేయాల్సి ఉంటుంది. వాటి కోసం రోస్టర్ వివరాలు పంపించవలసిందిగా వివిద శాఖల కార్యదర్శులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి లేఖలు వ్రాశారు. ఇప్పటి వరకు గ్రూప్-1 ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి క్యాడర్ లో ఉండేవి. ఇప్పుడు వాటిని మల్టీ జోన్లలోకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతించాలి. 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలవక ముందు సిఎం కెసిఆర్‌ ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండేవారు. కానీ ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేయడంతో ఆయనకు క్షణం తీరిక ఉండటం లేదు. కనుక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నతాధికారులే చొరవ తీసుకొని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు నడిపించవలసి ఉంటుంది. కానీ సిఎం కెసిఆర్‌, మంత్రులు ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోగలరా? అంటే అనుమానమే. కనుక నోటిఫికేషన్స్ ఎప్పుడు వెలువడుతాయో...ఉద్యోగాల ఎప్పుడు భర్తీ అవుతాయో ఎవరికీ తెలియదు. 

Related Post