9,355 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

August 31, 2018
img

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ గురువారం మొట్టమొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీలలో 9355 మండి కార్యదర్శుల నియామకానికి నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 11వరకు ఆన్-లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీలోగా నిర్దేశిత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలకు http://tspsri.cgg.gov.in  వెబ్ సైటులో లభిస్తాయి. అలాగే ఈ ఉద్యోగాలకు అర్హత, జీతం వగైరా వివరాలను తెలియజేస్తూ వ్రాయబడిన http://www.mytelangana.com/telugu/education/13123/guidelines-for-panchayat-secretaries-posts  ఈ లింకులో కూడా చూడవచ్చు.       


Related Post