ఆ ఉపాద్యాయులు వేరు...వీళ్ళు వేరు!

August 28, 2018
img

ఉపాధ్యాయులు ఎవరైనా చేసే పని ఒకటే...కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయులు వేరు... పంచాయితీరాజ్ పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులు వేరని ఉపాధ్యాయులే అనుకోవడం విచారకరం.

పంచాయితీరాజ్ పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఉపాధ్యాయులు అందరికీ ఏకీకృత సర్వీస్ రూల్స్ నిబందనలను అమలులోకి తెచ్చింది. దాని వలన పంచాయితీరాజ్ పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయులకు వర్తించే సర్వీసు నిబందనలే వర్తిస్తాయి కనుక వారికి ఆమేరకు లబ్ది కలుగుతుంది. కానీ వారిని కూడా తమతో చేర్చి ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలుచేయడం వలన తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని భావించిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు ఏకీకృత సర్వీస్ నిబంధనల కోసం జూన్ 23న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ వారి పిటిషనుపై విచారణ చేపట్టి ఇరుపక్షాల వాధానాలు విన్న తరువాత ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను కొట్టివేస్తునట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయితీ రాజ్ శాఖ ఉద్యోగులకు వేర్వేరు నియమనిబంధనలు ఉన్నందున ఆ ప్రకారమే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వగైరా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Related Post