ఆగస్ట్ 29న హైదరాబాద్‌ జాబ్ మేళా

August 28, 2018
img

హైదరాబాద్‌లో బుదవారం జాబ్ మేళా జరుగబోతోంది. నగరంలోని ఇన్ఫో పోర్టల్ ట్రేడ్ హైదరాబాద్‌.కామ్, ఇన్నోవ్ సోర్స్, డిడి ఇనిషియేటివ్స్, ఈక్విటీస్ సంస్థలు కలిసి ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకురాలు శ్రీలత తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్, బిఏ, బికాం, బిఎస్సీ డిగ్రీలు, ఎంబిఏ, బీటెక్ (ఐటి లేదా సి.ఎస్.సి) చేసినవారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ఉద్యోగానుభవం ఉన్నవారితో పాటు కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్ధులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ ఉద్యోగాలలో నెలకు రూ.8,500 మొదలు రూ.22,800 జీతం+అలవెన్సులు లభించే వేర్వేరు ఉద్యోగాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబందించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి 73375 56150 నెంబరుకు ఫోన్ చేయవలసిందిగా ఆమె కోరారు. దీనిలో పాల్గొనే అభ్యర్ధుల నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం లేదని ఇది ఉచిత జాబ్ మేళా అని ఆమె తెలిపారు.        


Related Post