పంచాయితీ కార్యదర్శి ఉద్యోగాలకు మార్గదర్శకాలు

August 27, 2018
img

తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయితీలలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించబోతోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామాణాభివృద్ధి శాఖ  ఈరోజు వీటికి సంబందించి నియమనిబందనలను ప్రకటించింది. 

ఆ వివరాలు:   

1. రాజధాని హైదరాబాద్‌ మినహాయించి 30 జిల్లాల ప్రాతిపాదికన ఈ నియామకాలు జరుగుతాయి.        

2. కనీస విద్యార్హత: డిగ్రీ. 

3. 18 నుంచి 39 ఏళ్ళలోపూ వయసున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

4. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు 5 సం.లు, వికలాంగులకు 10 సం.లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే 44 సం.ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు, 49 సం.లు వయసున్న వికలాంగులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నమాట.

5. పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. (తెలంగాణా చరిత్ర, సంస్కృతి, కొత్త పంచాయతీ రాజ్ చట్టం, స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పాలనా విధానం, జనరల్ నాలెడ్జి అనే అంశాలపై మొత్తం 150 మార్కులకు పరీక్షలు నిర్వహించబడతాయి.          

6. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినవారు మొదట మూడేళ్ళపాటు ట్రైనీగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15,000 జీతం ఇవ్వబడుతుంది. అయితే ఎటువంటి ఇతర అలవెన్సులు ఉండవు. మూడేళ్లలో పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే శాస్విత ప్రతిపదికన గ్రామపంచాయితీ కార్యదర్శులుగా నియమించబడతారు. 

7. జె.ఎన్.టి.యు లేదా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు లేదా గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు లేదా వేరేదైనా సంస్థ ద్వారా ఈ పరీక్షల నిర్వహణ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. త్వరలోనే ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడబోతోంది. 

సాధారణ విద్యార్హతలతో 39 నుంచి 49సం.ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమున్న ఉద్యోగాలు ఇవి. వందో వెయ్యో కాక ఏకంగా 9,355 పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి. కనీస అర్హతలతో నెలకు రూ.15,000 జీతం లభించడం అంటే మంచి జీతంగానే చెప్పుకోవచ్చు. మూడేళ్ళ తరువాత ఉద్యోగాలు పర్మనెంట్ చేయబడతాయి. కనుక రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు అందరికీ ఇది చాలా మంచి అవకాశమేనని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొంటే మంచిది.

Related Post