నిరుద్యోగులకు శుభవార్త

August 17, 2018
img

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధబలగాలలో 54,953 కానిస్టేబుల్ పోస్టులకు కేంద్ర స్టాఫ్ సెలెక్షన్ కమిటీ దరఖాస్తులు ఆహ్వానించింది. నేటి నుంచి సెప్టెంబర్ 17వరాకు దరఖాస్తులు స్వీకరిస్తారు.  ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారిని సి.ఆర్.పి.ఎఫ్, బి.ఎస్.ఎఫ్, ఎన్.ఐ.ఏ, ఎస్.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి,  అసోమ్ రైఫిల్స్ విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందని సి.ఆర్.పి.ఎఫ్. కమాండెంట్ హరిహోం ఖరే తెలిపారు.

ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలు www.ssc.nic.in వెబ్ సైట్ లో లభిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులకు వీటికి సంబందించి సందేహాలున్నట్లయితే హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట వద్ద గల సి.ఆర్.పి.ఎఫ్ కార్యాలయంలో నేరుగా గానీ లేదా 040-29809876 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 


Related Post