టి.ఎస్.పి.ఎస్.సి. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందంటే..

August 01, 2018
img

టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ ఘంటా చక్రపాణి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి, 2016-17 సం.లలో చేసిన నియామక ప్రకటనలు, ఉద్యోగాల భర్తీ తదితర వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. 2016-17లో మొత్తం 121 నోటిఫికేషన్లు జారీ చేశామని ఆ నివేదికలో పేర్కొన్నారు. వివిధ కారణాల చేత వాటిలో 2,343 నోటిఫికేషన్లను ఉపసంహరించుకొన్నామని తెలిపారు. త్వరలో మరో 1,917 పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు గ్రూప్-1లో 128 పోస్టులు, వివిధ శాఖలలో 36,076 పోస్టులు భర్తీకి ప్రకటనలు ఇచ్చామని వాటిలో 12,749 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. వివిధ శాఖలలో 20,360 పోస్టులకు ఇంటర్వ్యూలు, వ్రాత పరీక్షలు వగైరాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఆ ప్రక్రియలు పూర్తి చేసి పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు నియామకపత్రాలు అందజేస్తామని తెలిపారు. అంటే 2016-17 సం.లలో కేవలం 12,749 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ లెక్కన ఐదేళ్ళలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడం సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. 


Related Post