ప్రముఖ తెలంగాణా రచయిత ఆత్మహత్య

July 18, 2018
img

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన ప్రముఖ రచయిత, ఉపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ ఆత్మహత్య చేసుకొన్నారు. అయన ఇటీవలే మునిపంపుల ప్రభుత్వ పాఠశాల నుంచి చిన్నకాపర్తి జెడ్పిహెచ్ స్కూలుకు బదిలీపై వచ్చారు. రోజూలాగే మంగళవారం ఉదయం తన ద్విచాక్రవాహనంపై స్కూలుకు బయలుదేరిన జగదీశ్వర్ దారిలో చిట్యాల శివారులో రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. కుటుంబ కలహాలే అయన ఆత్మహత్యకు కారణమని సమాచారం. గత కొంతకాలంగా ఇంట్లో భార్యాభర్తల మద్య తగాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

జగదీశ్వర్ ప్రధానంగా బాలల మనోవికాసం కోసం అనేక చక్కటి కధలు వ్రాశారు. ఆయన ఇప్పటివరకు 30 పుస్తకాలు రచించారు. ఆయన వ్రాసిన ‘చెట్టు కోసం’ అనే కధను మహారాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి తెలుగు పాఠ్యాంశంగా చేర్చింది.    ఆయన రచయిత, ఉపాద్యాయుడు కావడంతో సమాజంలో మంచి గౌరవం పొందుతుండేవారు. అటువంటి వ్యక్తి అర్ధంతరంగా చనిపోవడం చూసి అందరూ బాధపడుతున్నారు. 


Related Post