హమ్మయ్యా...టీచర్ల బదిలీలు పూర్తయ్యాయి

July 11, 2018
img

రాష్ట్రంలో ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ మంగళవారంతో ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ బదిలీల ప్రక్రియ కోసం అధికారులు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఊహించని అనేక ఇబ్బందులు ఎదురవడంతో చాలా ఆలస్యమైంది. నేటికీ అనేకమంది ఉపాధ్యాయులు తమ బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియారిటీ పాయింట్ల ప్రకారం బదిలీలలో ప్రాధాన్యత లభించలేదని, సాంకేతిక కారణాల చేత తాము నష్టపోయామని పిర్యాదులు చేస్తున్నారు. అయితే బదిలీల ప్రక్రియ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించేరు కనుక మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఈ హడావుడి ఉండదు.

ఈసారి మొత్తం 40,729 మంది ఎస్.జి.టీ.లు, 31,968 స్కూల్ అసిస్టెంట్లు,2,193 మంది ప్రధానోపాద్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకొన్నారు.

Related Post