పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్

July 10, 2018
img

తెలంగాణా పోలీస్ శాఖలో 18,428 పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటికి సంబంధించి ప్రాధమిక పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.

ఆ వివరాలు: 


దరఖాస్తులలో తప్పులు సవరించుకోవచ్చు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నప్పుడు పేరు, పుట్టినతేదీ, వయసు, చిరునామా, కులం వగైరా వివరాలలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే వాటిని సవరించుకోవచ్చునని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస రావు తెలిపారు.    తప్పులు వాటిని సవరించుకోవాడానికి అవకాశం కల్పించబడింది. అభ్యర్ధులు తాము దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్ ద్వారా support@tslprb కి తప్పులు సవరించి ఆ వివరాలను పంపించవచ్చని చెప్పారు. దీనికి జూలై 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే గడువు ఉందని ఆ తరువాత వచ్చే అభ్యర్ధనలను పరిశీలించబోమని చెప్పారు. అంటే ఇంకా నాలుగు రోజలు సమయం ఉందన్న మాట. సవరించుకోకుంటే పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించకపోవచ్చు లేదా ఉద్యోగాలకు ఎంపిక అయిన తరువాత అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వడానికి నిరాకరించే ప్రమాదం ఉంది. కనుక అభ్యర్ధులు అందరూ మరొకసారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించుకొని తప్పులు ఉన్నట్లయితే తక్షణమే సవరింపజేసుకోవడం చాలా అవసరం.

Related Post