ఇది వారికి శుభవార్తే!

June 08, 2018
img

 తెలంగాణా పోలీస్ శాఖలో 18,428 పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితిని మూడేళ్ళకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో:62) జారీ చేసింది. తద్వారా మరో 30,000 మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. వీటిలో  అత్యధికంగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియేట్ విద్యార్హత సరిపోతుంది కనుక ఇది నిరుద్యోగ యువతకు చాలా చక్కటి అవకాశం. జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూలై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్-లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్ లో లభిస్తాయి.  


Related Post