నీట్ లో గురుకుల వాటా 87 సీట్లు!

June 06, 2018
img

లక్షలు ఖర్చు చేసి కార్పోరేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన విద్యార్దులకు మన గురుకుల విద్యార్ధులు ఏమాత్రం తీసిపోరని మరోమారు నిరూపించి చూపారు. రాష్ట్రంలో వివిధ బిసి, గిరిజన గురుకుల కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ ఎమరాల్డ్’ పేరుతో నీట్ పరీక్షల శిక్షణా తరగతులను నిర్వహించింది. వాటిలో శిక్షణ పొందినవారిలో దాదాపు అందరూ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద విద్యార్ధులే. వారిలో 87మంది నీట్ లో మంచి ర్యాంకులు సాధించారు. 

ఇక వారు సాధించిన ర్యాంకులను పరిశీలిస్తే, ఒక నిరుపేద కూలి కొడుకు అయిన జుబ్లియేంట్ జాత్రోత్ నవీన్ జాతీయస్థాయిలో ఎస్టి కోటాలో 216వ ర్యాంక్ సాధించాడు. ఎస్టీ కోటాలోనే రాజేంద్ర నగర్ గిరిజన గురుకులానికి చెందిన జె. నవీన్ కుమార్ 210,బి గణేష్ 612వ ర్యాంక్ సాధించారు. 

ఇక గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన ఎల్.సాయి కిషోర్ 767, విష్ణు 1,174, లిఖిత 2,014, సుష్మిత 2,255ర్యాంకులు సాధించి వైద్యకోర్సులలో చేరేందుకు అర్హత సాధించారు. కానీ కార్పోరేట్ కాలేజీల ప్రచారహోరులో వారు మరుగునపడిపోయారు. అయితేనేమి..వారిలో 63 మంది ఎంబిబిఎస్, 24మంది బిడిఎస్ వైద్యకోర్సులలో ప్రవేశానికి అర్హత సాధించారు.

Related Post