తొమ్మిదిమంది ఉపాద్యాయులపై సస్పెన్షన్ వేటు

June 05, 2018
img

పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయితే విద్యార్ధులు ఒత్తిడికి గురవడం సహజం. కానీ అందుకు ఉపాద్యాయులు కూడా మూల్యం చెల్లించవలసిరావడం విచిత్రం. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న 10వ తరగతి విద్యార్ధులకు లెక్కలలో చాలా తక్కువ మార్కులు రావడంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచన మేరకు జిల్లా విద్యాశాఖ 9మంది లెక్కల టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సస్పెండ్ అయిన ఉపాధ్యాయులలో శ్వేతామాధురీ (జెడ్పి.హెచ్.ఎస్.మరికల్), నయీం సిద్దికీ (జెడ్పి.హెచ్.ఎస్. ఉర్దూ మీడియం, మరికల్), శ్రీనివాస్ రెడ్డి (జెడ్పి.హెచ్.ఎస్.పెద్ద చింతకుంట), రామాచారి (జెడ్పి.హెచ్.ఎస్.కోయిల్ సాగర్), రవికుమార్ (జెడ్పి.హెచ్.ఎస్.బండర్ పల్లి), జ్యోతి, ప్రకాష్ రెడ్డి (జెడ్పి.హెచ్.ఎస్.తాటిపర్తి) బాలశివుడు, నర్సింహులు (జెడ్పి.హెచ్.ఎస్.నవాబుపేట) ఉన్నారు. అలాగే ఇదే కారణంతో మరో 11 మంది ప్రదానోపాద్యాయులకు షో-కాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

వారితో పాటు కేజీబివిలలో మంచి ఫలితాలు రాబట్టలేకపోయినందుకు నలుగురు ఎస్.ఈ.ఓ.లను విధులలో నుంచి తొలగించబడ్డారు. 


Related Post