ఓయులో అగ్ని ప్రమాదం

June 05, 2018
img

ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ్ళ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. యూనివర్సిటీలో మానేరు హాస్టల్ వెనుక వైపున్న స్టోర్ రూమ్ లో హటాత్తుగా మంటలు చెలరేగడంతో దానిలో భద్రపరిచిన విద్యార్ధుల జవాబు పత్రాలన్నీ కాలి బూడిదైపోయాయి. ఈ సమాచారం అందుకొని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ ఆలోగానే ఆ గదిలో భద్రపరిచిన జవాబు పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఏ పరీక్షాపత్రాలు కాలిపోయాయో ఇంకా తెలియవలసిఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగానే మంటపెట్టారా అనే కోణంలో నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదానికి కారణం ఏదైనప్పటికీ విద్యార్ధుల శ్రమంతా బూడిదగా మారింది కనుక మళ్ళీ పరీక్షలు వ్రాయకతప్పదు.


Related Post