మల్లారెడ్డికి వద్దు

May 16, 2018
img

హైదరాబాద్ లోని మల్లారెడ్డి వైద్యకళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ కాలేజీలో 2018-19, 2019-20 విద్యాసంవత్సరాలలో వైద్యవిద్యార్ధులను చేర్చుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఒక లేఖ వ్రాసినట్లు సమాచారం. మల్లారెడ్డి వైద్యకళాశాల వైద్యవిద్యకళాశాలగా కొనసాగేందుకు విదించబడిన నిబందనలు పాటించడంలేదని, ఆసుపత్రిలో రోగులను చేర్చుకొనే విషయంలోను పలు అనుమానాలున్నాయని కనుక రెండు సంవత్సరాల పాటు దానిలో వైద్యవిద్యార్దులను చేర్చుకోవడానికి వీలులేదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ ద్వారా తెలియజేసింది. ఇటీవలే వెలువడిన తెలంగాణా ఎంసెట్ ప్రవేశపరీక్షలలో వైద్యకళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్ధులు మెడికల్ కౌన్సిల్ తాజా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య కళాశాలను ఎంచుకొంటే మంచిది.                    


Related Post