త్వరలో టి-ఎంసెట్ ఫలితాలు

May 08, 2018
img

మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశపరీక్షలను ఆన్-లైన్ ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా సోమవారంతో పూర్తయ్యాయి. కనుక మంగళవారం ఎంసెట్ ప్రాధమిక ‘కీ’ ని విడుదల చేయబోతున్నట్లు ఎంసెట్ పరీక్షల కన్వీనర్ యాదయ్య తెలిపారు. దానిపై విద్యార్ధులు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మే 10వ తేదీ సాయంత్రం 6గంటలలోగా తెలియజేయాలని కోరారు. ఈ ప్రాధమిక ‘కీ’ www.eamcet.tsche.ac.in అనే వెబ్ సైటులో నేటి నుంచి విద్యార్ధులకు అందుబాటులో ఉంటుందని యాదయ్య తెలిపారు. దానిపై విద్యార్ధుల అభ్యంతరాలను పరిశీలించిన తరువాత ఈ నెల 18వ తేదీన ఎంసెట్ ఫలితాలు ప్రకటించాలని అనుకొంటున్నట్లు యాదయ్య తెలిపారు.

ఎంసెట్ పరీక్షలకు హాజరైన 2,03,168 మంది విద్యార్ధుల ఓఎంఆర్ పత్రాలను వారి ఈ-మెయిల్ ఐడిలకు పంపించబోతున్నట్లు తెలిపారు. మే 2నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ ఆన్-లైన్ పరీక్షలలో మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగానికి 66,857 మంది, ఇంజనీరింగ్ విభాగానికి 1,36,311 మంది విద్యార్ధులు హాజరయ్యారని యాదయ్య తెలిపారు.      


Related Post