టీఎస్‌జెన్‌కోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

April 14, 2018
img

టీఎస్‌జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-33 పోస్టులు (హెచ్.ఆర్), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-42 పోస్టులకు ఆన్-లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. 

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు ఉండవలసిన అర్హతలు: ఎంబిఏ (హెచ్.ఆర్)/ ఎంఎస్.డబ్ల్యూ/పర్సనల్ మేనేజిమెంట్/ హ్యూమన్ రైట్స్/ లా కోర్సులో 2 సం.ల డిగ్రీ కలిగి కనీసం 8సం.లు అనుభవం కలిగి ఉండాలి. 

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ఉండవలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంకాం/ బికాం (ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యుండాలి). లేదా సిఏలో ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఉండాలి. 

వీటికి ఏప్రిల్ 13 నుంచి మే 10వరకు ఆన్-లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ మే 9. మే 20వ తేదీన హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలకు www.tsgenco.co.in లో చూడవచ్చు. 

Related Post