1,127 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర

April 03, 2018
img

తెలంగాణా పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ బిసి గురుకుల పాఠశాలలలో గల 1,127 ఖాళీలు భర్తీ చేయడానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ఎన్.శివశంకర్ సోమవారం టి.ఎస్.పి.ఎస్.సి.కి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో 499 పోస్టులు, బీసి గురుకుల పాఠశాలలలో 628 పోస్టులు ఉన్నాయి. ఆర్ధికశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది కనుక త్వరలోనే టి.ఎస్.పి.ఎస్.సి. వాటి భర్తీకి మార్గదర్శకాలను రూపొందించి నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. 

పోలీస్ శాఖలో ఖాళీల వివరాలు: 

జూనియర్ అసిస్టెంట్లు:368, సీనియర్ స్టెనోగ్రాఫర్లు: 12, జూనియర్ స్టెనోగ్రాఫర్లు:29, టైపిస్టులు: 89, లైబ్రేరియన్లు: 1, మొత్తం:499 పోస్టులు.

బీసి గురుకుల పాఠశాలలలో ఖాళీల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు:543, పీడి (డిగ్రీ కాలేజీ): 1, ఫిజికల్ డైరెక్టర్లు(పాఠశాలలు):60, పీఈటి (పాఠశాలలు):3, లైబ్రేరియన్ (డిగ్రీ కాలేజీకి):1, అసిస్టెంట్ లైబ్రేరియన్లు (డిగ్రీ కాలేజీకి):1, జూనియర్ అసిస్టెంట్లు:19, మొత్తం:628 పోస్టులు.

Related Post