సికింద్రాబాద్ రైల్వే డివిజన్ లో 6,523 ఉద్యోగాలు

February 12, 2018
img

రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ లో 6,523 ఉద్యోగాలున్నాయి. వాటికి మార్చి 12వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి/ ఐటిఐ/ నేషనల్  అప్రెంటిషిప్ సర్టిఫికేట్ పొందినవారు అర్హులు. దీనికి 18-31 సం.లలోపు వయసున్నవారు అర్హులు. వీటి పరీక్షలను ఆన్-లైన్ ద్వారానే నిర్వహిస్తారు. వాటిలో జనరల్ కేటగిరీ వారికి 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి వర్గాలకు చెందినవారికి 30 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఇవి రైల్వేలో అట్టడుగు స్థాయి ఉద్యోగాలు అయినప్పటికీ కనీసం వేతనం నెలకు రూ.18,000+ అలవెన్సులు లభిస్తాయి. కనుక అర్హులైన అభ్యర్ధులు ముందుగా దరఖాస్తులు సమర్పించి, ఈ పరీక్షలను ఎదుర్కోవడానికి తగిన కోచింగ్ తీసుకొంటే మంచిది. పూర్తి వివరాలకు: https://www.rrbrecruitmenthelp.in/rrc-group-d-indian-railway వెబ్ సైట్ లో చూడవచ్చు. 


Related Post