టి.ఆర్.టి. పరీక్షల షెడ్యూల్ ప్రకటన

February 01, 2018
img

టి.ఆర్.టి.(టీచర్స్ రిక్రూట్మెంట్) పరీక్షల షెడ్యూల్ ను టి.ఎస్.పి.ఎస్.సి. ప్రకటించింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. ఆ వివరాలు: 

గురుకుల పోస్టులకు కేవలం ఆన్లైన్లో కంప్యూటర్‌ ఆధారిత భర్తీ పరీక్ష పద్దతిలోనే పరీక్షలు నిర్వహించబడతాయి. 

ఉపాధ్యాయ పోస్టులలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం ఎస్జీటీ పోస్టులు, బయాలజీ, మ్యాథ్స్, సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించబడతాయి. 

మిగిలినవాటికి సిబిఆర్టి విధానంలో పరీక్షలు నిర్వహించబడతాయి.

లాంగ్వేజ్‌ పండిట్, స్కూల్‌ అసిస్టెంట్‌–తెలుగు, పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌–బయాలజీ, మేథ్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (తెలుగు మీడియం) మినహా మిగిలిన అన్ని పరీక్షలను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు.

గురుకుల కాలేజీలలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షలు: ఫిబ్రవరి 19న నిర్వహించబడతాయి. ఉదయం పేపర్-1 (పెడగాజీ), మధ్యాహ్నం పేపర్-2 (సంబంధిత సబ్జెక్ట్).

గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్‌ పోస్టులకు 21న ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్షలు నిర్వహించబడతాయి.

డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు 20వ తేదీన ఉదయం పరీక్ష నిర్వహిస్తారు.

డిగ్రీ కాలేజీల లైబ్రేరియన్‌ పోస్టులకు 20న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. 

డిగ్రీ కాలేజీలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు 23వ తేదీన మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి.

జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ పోస్టులకు 22న ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్షలు ఉంటాయి.

జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు 23న ఉదయం నిర్వహించబడతాయి. 

ఫిబ్రవరి 24న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ (తెలుగు)

ఫిబ్రవరి 25న ఎస్జీటీ ఉదయం తెలుగు, మధ్యాహ్నం ఇంగ్లీష్

ఫిబ్రవరి 26న స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్), మ్యాథ్స్, సోషల్

ఫిబ్రవరి 27న స్కూల్ అసిస్టెంట్ - ఫిజికల్ సైన్స్

ఫిబ్రవరి 27న లాంగ్వేజ్ పండిట్ - ఉర్దూ, మరాఠీ, హిందీ

ఫిబ్రవరి 28న స్కూల్ అసిస్టెంట్- పీఈటీ పరీక్షలు

మార్చి 2న స్కూల్ అసిస్టెంట్ - ఫిజికల్ ఎడ్యుకేషన్

మార్చి 3న స్కూల్ అసిస్టెంట్ - ఇంగ్లీష్

మార్చి 4న స్కూల్ అసిస్టెంట్ - బయాలజీ, మ్యాథ్స్, సోషల్

మార్చి 4న పీఈటీ - ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించబడతాయి.

Related Post