ఇక భారత్ కు తిరుగులేదు

November 22, 2017


img

క్షిపణి ప్రయోగాలలో భారత్ ఈరోజు మరొక అద్భుతమైన విజయం సాధించింది. మొట్టమొదటిసారిగా అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణిని వాయుసేనకు చెందిన యుద్దవిమానం సుఖోయ్-30 నుంచి ప్రయోగించి చూశారు. బంగాళాఖాతంలోని నిర్దిష్ట లక్ష్యాన్ని అది విజయవంతంగా చేదించింది. రష్యా సహకారంతో భారత్ నిర్మించిన తొలి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇది. ఇంతకు ముందు దీనిని భూమీద నుంచి, సముద్రం మీద నుంచి ప్రయోగించి చేసిన పరీక్షలు విజయవంతం అవడంతో యుద్దవిమానాల నుంచి అత్యంత క్లిష్టమైన ఈ ప్రయోగం కూడా విజయవంతంగా నిర్వహించారు. తద్వారా ఈ క్షిపణులను దూరం నుంచే కాకుండా అవసరమైతే యుద్దవిమానాలతో నేరుగా శత్రుస్థావరాల వద్దకే వెళ్ళి అక్కడి నుంచే ఆ క్షిపణులతో దాడులు చేయవచ్చు. కనుక శత్రువుల పాలిట ఇది నిజంగా బ్రహ్మాస్త్రం వంటిదేనని చెప్పవచ్చు. ఒక్కో క్షిపణి బరువు సుమారు 2,500 కేజీలు ఉంటుంది. అంతబరువైన క్షిపణులను సుఖోయ్ యుద్దవిమానాల ద్వారా ప్రయోగించగలగడం కూడా విశేషమే. భారత్ బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది కనుక నేడోరేపో పాకిస్తాన్ కూడా పోటీగా ఏదో ఒక క్షిపణి ప్రయోగం చేయకమానదు.   



Related Post