రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్ళక తప్పదా?

July 25, 2017


img

డ్రగ్స్ కేసులను విచారిస్తున్న సిట్ అధికారులు, వారికి నేతృత్వం వహిస్తున్న అకున్ సబర్వాల్ పై, తెరాస సర్కార్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై ఈరోజు రంగారెడ్డి కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అతను సిట్ దర్యాప్తుకు ఆటంకం కలిగించేలాగ, వారి మనోస్తైర్యం దెబ్బతినేవిధంగా, తెలంగాణా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చాలా అనుచితమైన మెసేజులు పెడుతున్నాడని రంగ ప్రసాద్ అనే న్యాయవాది ఈరోజు కోర్టులో పిటిషన్ వేశారు. ఐపిసి సెక్షన్: 343 ప్రకారం ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించేలా మాట్లాడటం లేదా వ్యవహరించడం నేరమని కనుక చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. 

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నిన్ననే వర్మను ఘాటుగా హెచ్చరించినప్పటికీ అతను ఏమాత్రం జంకకుండా ఈరోజు ఇంకా ఘాటుగా విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అకున్ సబర్వాల్ బృందం చేస్తున్న దర్యాప్తు వలన తెలంగాణా రాష్ట్ర ప్రతిష్ట, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట గంగలో కలుస్తోందని ఆరోపించారు. ఇదివరకు జస్టిస్ కర్ణన్ కూడా ఇదేవిధంగా రెచ్చిపోయారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన కటకటాలు లెక్క పెడుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులతో వర్మకు ఎటువంటి సంబంధమూ లేకపోయినప్పటికీ అనవసరంగా మద్యలో దూరి దర్యాప్తు బృందంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందిపెడుతున్నారు. అకున్ సబర్వాల్ హెచ్చరించినా ఏమాత్రం జంకడం లేదు. కనుక ఒకవేళ న్యాయస్థానం ఈ ఈ పిటిషన్ తో ఏకీభవించినట్లయితే రామ్ గోపాల్ వర్మ కూడా జైలుకు వెళ్ళకతప్పదేమో. 


Related Post