కాకతీయ వంశ పాలకురాలు, రాణి రుద్రమ దేవి

June 02, 2016


img

కాకతీయ రాజవంశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాణి రుద్రమదేవి క్రిశ 1262-1289 కాలంలో ఉన్న పాలకుల్లో ముఖ్యులు. కుమారులు లేని గణపతి దేవునికి, రుద్రాంబగా రాణి జన్మించింది. అప్పటినుండి రుద్రాంబని కుమారుని వలే పెంచుతూ రుద్రదేవా అని నామకరణం కూడా చేశారు. నిడదవోలు తూర్పు చాళుక్య వంశానికి యువరాజైన వీర భద్రునితో రాణి వివాహం జరిగింది. 

ఆమె అంతర్గత తిరుగుబాట్లు మరియు బాహ్య దాడులు అణచివేశారు. చోళుల నుండి యాదవుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన రాణి, వాళ్ళ గౌరవాన్నికూడా సంపాదించగలిగింది. దక్షిణ భారత దేశంలో అత్యంత కొద్దిమంది స్త్రీ శక్తులలో రాణి రుద్రమదేవి ఒకరు.



Related Post