ఈ ఫోటోల హడావుడి ఏమిటో?

June 07, 2017


img

ముంబైలో ‘కాల’ సినిమా షూటింగ్ ముగించుకొని రజనీకాంత్ బుదవారం చెన్నై తిరిగివస్తున్నారు. మళ్ళీ ఈనెల 15,16 తేదీలలో అయన తన అభిమానులతో ఫోటోలు దిగేందుకు సిద్దం అవుతున్నారు. కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. అవసరమయితే మళ్ళీ మరోసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైనా సందర్భంలో తమ అభిమాన హీరోలను కలిసినప్పుడు అభిమానులు ఫోటోలు, సేల్ఫీలు తీసుకోవడం సహజమే కానీ తమిళనాడులో ఇదే ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకోవడం కొంచెం అతిగా కనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఫోటోలు తీసుకోవడం వరకే పరిమితం కాకుండా రజనీ రాజకీయ ప్రవేశం గురించి చర్చకు దారి తీయడమే విచిత్రం. దానిపై ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాలు ధర్నాలు, ర్యాలీలు చేశాయి కూడా. ఆ ఫోటోల కార్యక్రమం తరువాత రజనీ త్వరలో రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారని ఆయన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ మీడియాకు తెలిపారు. కనుక ఈసారి రజనీ ఏమి చెపుతారో చూడాలి. అయినా రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటే దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకో? నేరుగా ప్రవేశించవచ్చు కదా?



Related Post