అప్పుడే ప్రాజెక్టులు కడితే మరి పొలాలకు నీళ్ళు అందలేదేమి?

March 22, 2017


img

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు, పరస్పర ఆరోపణలు జరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాస సర్కార్ తమవిగా చెప్పుకొంటున్న ఆ ప్రాజెక్టులన్నీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కట్టిపడేసిందని, వాటికే అది కొన్ని మార్పులు  చేర్పులు చేసి బారీగా అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క శాసనసభలో వాదించారు. అసలు తెరాస సర్కార్ కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదని వాదించారు. 

వారి వాదనలతో విసిగెత్తిపోయిన నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ శాసనసభ్యురాలు డికె అరుణకు చెయ్యెత్తి దణ్ణం పెట్టి “మీ ప్రాంతానికి నీళ్ళు అందించేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు దయచేసి అడ్డుపడొద్దు. మీరు సగంలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నేను, మా అధికారులు కాంట్రాక్టర్ల చుటూ తిరిగి వారిని బ్రతిమాలుకొని ఒప్పించి అతికష్టం మీద పూర్తి చేయించుకొంటున్నాము. కనుక దయచేసి ప్రాజెక్టులపై వితండవాదం చేయడం మానుకొని అవి పూర్తి కావడానికి మాకు దయచేసి సహకరించండి. అందరం కలిసి ప్రాజెక్టులు నిర్మించుకొని రాష్ట్రా సస్యశ్యామలం చేసుకొందాము. దయచేసి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులలో వేసిన పిటిషన్లను కూడా ఉపసంహరించుకోండి. ప్రభుత్వం తలపెట్టే ప్రతీ పనిని వ్యతిరేకించడమే రాజకీయం అని భావించకండి,” అని వేడుకొన్నారు. 

కాంగ్రెస్ సభ్యులు చెప్పుకొంటున్నట్లుగా వారి హయంలో ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలో పొలాలకు నీళ్ళు అందించి ఉండి ఉంటే తెలంగాణా ఉద్యమం జరిగి ఉండేదే కాదేమో? నీళ్ళ విషయంలో తెలంగాణాకు తీరని అన్యాయం జరుగిందనే బాధతోనే ఉద్యమాలు పురుడుపోసుకొన్నాయని కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు. ఒకవేళ ఈ వాదన తప్పు అనుకొన్నా వారి హయంలో నిజంగా ప్రాజెక్టులు కట్టి ఉండి ఉంటే రాష్ట్రంలో అన్ని లక్షల ఎకరాలు ఎండబెట్టుకొనే పరిస్థితి ఉండకూడదు. ఆ కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండకూడదు. కానీ నీళ్ళు లేక పంటలు ఎండిపోయాయి..వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన తప్పును ఒప్పుకోకపోయినా, కప్పిపుచ్చుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ తెలంగాణా ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులకు కూడా అడ్డుపడితే కాంగ్రెస్ నేతలను తెలంగాణా ప్రజలు ఇక ఎన్నటికీ క్షమించబోరని గ్రహించాలి. 

2017-18 సం.లలో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రభుత్వం నిర్మిస్తున్న  ప్రాజెక్టులు వాటికి అయ్యే ఖర్చు, ఆ ప్రాజెక్టుల క్రింద సాగులోకి వచ్చే ఆయకట్టు వివరాలు ఇవిగో: 



Related Post