యూపిలో భాజపాని గెలిపించింది వాళ్ళిద్దరే..కానీ

March 11, 2017


img

యూపి ప్రజలు భాజపా అభ్యర్ధులను చూసి కాకుండా ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలను చూసే భాజపాకు ఓట్లు వేశారని చెప్పక తప్పదు. కనుక ఆ క్రెడిట్ వారిరువురికే చెందుతుంది. కనుక మోడీ కారణంగానే యూపిలో విజయం సాధించామని చెప్పుకోవచ్చు. అది సహజమే కూడా. కానీ భాజపా విజయానికి వారిరువురూ ఎంత కారణమో అంతకంటే ఎక్కువ కారణాలు వేరే కనిపిస్తున్నాయి.

1. ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నా అధికార సమాజ్ వాదీ పార్టీ కుటుంబ సభ్యుల మద్య కీచులాటలు. ఆ కారణంగా ప్రజలలో వారిపై అయిష్టత ఏర్పడటం. పార్టీ అగ్ర నేతలలో చీలిక కారణంగా పార్టీ కార్యకర్తలలో చీలికలు, అయోమయం ఏర్పడటం.

2. సమాజ్ వాదీ ప్రభుత్వం పదేళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కారణంగా సహజంగానే ప్రజలలో దానిపై వ్యతిరేకత ఏర్పడటం. ఆ కారణంగా దానిని మార్చి చూడాలనే ఆలోచన.   

3. యూపి ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ తప్పటడుగులు వేయడం. 

4. యూపిలో ప్రజాధారణ కోల్పోయి, కుంభకోణాలకు మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని దానికి 102 సీట్లు కట్టబెట్టడం.

5. యూపిలో మంచి జనాధారణ ఉన్న నేత అయిన ములాయం సింగ్ యాదవ్ ను పక్కన పెట్టి, అసమర్ధుడని పేరు పడిన రాహుల్ గాంధీతో కలిసి అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేయడం.

6. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ అంతటి వాడిని పట్టుకొని అఖిలేష్ యాదవ్ గాడిదలతో పోల్చడం. 

7. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా భాజపా ఎన్నికలకు వెళ్ళినందున, పార్టీలో నేతలు అందరూ పార్టీ విజయం కోసం సమిష్టిగా కృషి చేయడం.  

8. మాయావతి (బి.ఎస్.పి.) కూడా ఈసారి గట్టిగా పోరాడినందున కాంగ్రెస్, సమాజ్ వాదీల ఓట్లు చీలడం వంటి అనేక కారణాలు భాజపాకు వరంగా కనిపిస్తున్నాయి.  


Related Post