భాజపా అధికారంలో ఉండగా అద్వానీకి సమస్యలా?

March 06, 2017


img

ఈరోజుల్లో అధికార పార్టీ సభ్యులకు రాజభోగాలు, రాచ మర్యాదలు చాలా సర్వసాధారణమైన విషయమే. కానీ కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నప్పటికీ, ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి కష్టాలు ఎదుర్కోవలసి రావడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం అంటే 1992, డిశంబర్ 6న బాబ్రీ మశీదు కూల్చివేయబడింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు లాల్ కృష్ణ అద్వానీ కూడా ఒకరు. దానిపై సుదీర్గ విచారణ అనంతరం దిగువకోర్టు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ కేసుని కొట్టి వేసింది. ఆ తీర్పును సిబిఐ ఇదివరకు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, దిగువకోర్టు తీర్పును తప్పు పట్టింది. అటువంటి కుంటి సాకులతో కేసులను కొట్టివేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ కేసుపై మళ్ళీ మార్చి 22న విచారణ చేస్తామని చెప్పింది. 

ఆ కేసుపై సుప్రీంకోర్టు అభిప్రాయం విన్నట్లయితే నిందితుల పట్ల కటువుగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆ కేసులో లాల్ కృష్ణ అద్వానీని దోషిగా పేర్కొన్నట్లయితే, ఆయనకు వయసులో కష్టాలు మొదలైనట్లే చెప్పవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం పరిస్థితులను అంతవరకు రానీయకపోవచ్చు. 


Related Post