కవితక్క ప్రేమసందేశం!

February 15, 2017


img

నిన్న వ్యాలైన్ టైన్స్ డే సందర్భంగా ‘భారత్ టుడే’ ఆధ్యాత్మిక ఛానల్ వారి ఆధ్వర్యంలో ‘ప్రేమ దివస్’ పేరిట హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించారు. దానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ తెరాస ఎంపి కవిత హాజరయ్యారు. ఆ సభలో ఆమె మాట్లాడుతూ “వ్యాలైన్ టైన్స్ డే అనేది ఒక అబ్బాయి-అమ్మాయిల మద్య ప్రేమను వ్యక్తీకరించుకోవడానికే అనుకోవడం సరికాదు. కుటుంబంలో తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అందరి పట్ల ప్రేమాభిమానాలు పంచుకొన్నట్లయితే ఒక మంచి సమాజం ఏర్పాడుతుంది. ఒక తల్లి తన పిల్లలకు అనునిత్యం సేవలు చేస్తూనే ఉంటుంది. దానిని ఆమె ఏనాడూ భారంగా అనుకోదు. పిల్లలు కూడా తమ తల్లితండ్రులతో అదేవిధంగా వ్యవహరించడం వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఏదో ఒక రోజున ఖరీదైన బహుమతులు చేతిలో పెట్టి అదే ప్రేమను వ్యక్తీకరించడం అనుకోకుండా ఎల్లప్పుడూ అదే ప్రేమాభిమానాలను అందరితో పంచుకోగలగాలి. ఈ ప్రేమను కుటుంబానికే పరిమితం చేసుకోకుండా సమాజంలో మన చుట్టూ ఉన్న అనేకమంది నిర్భాగులు నిస్సహాయులు, అణచివేతకు గురవుతున్నవారి పట్ల కూడా మనం ప్రేమ, కరుణ చూపించడం నేర్చుకోవాలి. మన దేశంలో అనేక మతాలు, కులాలు, బాషలు, జాతులు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవారున్నారు. మనం కొంచెం విశాల దృష్టితో చూడగలిగితే, వారందరూ కూడా మన కుటుంబసభ్యుల వంటివారే..మనమంతా ఒకే పెద్ద కుటుంబం అనే భావన కలుగుతుంది. అదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కనుక ఈ వ్యాలైన్ టైన్స్ డేను ప్రేమికుల దినంగా కాకుండా ప్రేమ దివస్ గా చూడటం చాలా అవసరం,” అని అన్నారు.  


Related Post