భాజపాకు శివసేన షాక్

February 07, 2017


img

గుజరాత్ రాజకీయాలలో ఊహించని పరిణామం జరిగింది. పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి గుజరాత్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన హార్దిక్ పటేల్, మంగళవారం ముంబై వచ్చి శివసేన అధినేత ఉద్దావ్ టాక్రే సమక్షంలో ఆ పార్టీలో చేరాడు. 

శివసేన పార్టీ మహరాష్ట్రాలో భాజపాకు మిత్రపక్షంగా, భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కానీ అది భాజపాతో అనుబందం పెంచుకోలేదు. అది ఎప్పుడూ కూడా పక్కలో పాములాగే భాజపాపై బుసలు కొడుతూనే ఉంటుంది. త్వరలో జరుగబోయే గ్రేటర్ ముంబై కార్పోరేషన్ ఎన్నికలలో శివసేన ఒంటరిగా పోటీ చేయబోతోంది. ఇప్పుడు గుజరాత్ లోని భాజపాకు ప్రధాన శత్రువైన హార్దిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా భాజపాకు శివసేన మరో పెద్ద షాక్ ఇచ్చింది.

మహారాష్ట్ర, గుజరాత్ ఇరుగుపొరుగు రాష్ట్రాలే కానీ శివసేన పార్టీ ఇంతవరకు ఆ రాష్ట్రంలో ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేయలేదు. శివసేనకు ఇప్పుడు గుజరాత్ లో చాలా బలమైన, మంచి ప్రజాధారణ ఉన్న హార్దిక్ పటేల్ వంటి యువకుడు దొరికాడు కనుక ఈ ఏడాది చివరిలో జరుగబోయే శాసనసభ ఎన్నికలతో  ఆ రాష్ట్రంలో అడుగుపెట్టే ప్రయత్నం చేయవచ్చు. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో భాజపాయే అధికారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గుజరాత్ భాజపాకు పుట్టినిల్లు, కంచుకోట వంటిది. కానీ ఈసారి భాజపాకి మిత్రపక్షమైన శివసేన..రాష్ట్రంలో దానికి ప్రాతినిద్యం వహిస్తున్న హార్దిక్ పటేల్ నుంచి గట్టి సవాలు ఎదురవవచ్చు. కనుక ఇది భాజపా జీర్ణించుకోలేని విషయమేనని చెప్పవచ్చు. 


Related Post