తోక ముడిచిన పాక్

February 04, 2017


img

పాకిస్తాన్ పై కూడా త్వరలో నిషేధం విదిస్తానని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో కంగారు పడిన పాక్ ప్రభుత్వం, ముందుగా ఉగ్రవాది హఫీజ్ సయీద్ అతని అనుచరులను గృహనిర్బందం చేసి, తాము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంకేతాలు పంపింది. తాజాగా భారత్ తో శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన తరువాత భారత్ తో చర్చలు ప్రారంభించాలనుకొంటున్నట్లు ఆ దేశం మంత్రి హాసన్ ఇక్బాల్ పాక్ మీడియాతో అన్నారు. తమ దేశం భారత్, ఆఫ్ఘానిస్తాన్ తో సహా ఇరుగుపొరుగు అన్ని దేశాలతో శాంతి, స్నేహసంబంధాలు కోరుకొంటోందని అన్నారు. 

ఇదే పాక్ పాలకులు కాశ్మీర్ లో అల్లర్లను ప్రోత్సహించడమే కాకుండా, వారి పోరాటాలకు తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బహిరంగంగానే చెప్పుకొన్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానీ కాశ్మీర్ స్వాతంత్ర్య పోరాటంలో అశువులు బాసిన అమరవీరుడని, అతని మృతికి ఒకరోజు సంతాప దినం కూడా పాటించింది.     

కానీ ఇప్పుడు పాక్ ఇప్పుడు ఈవిధంగా మాట్లాడటానికి కారణం ట్రంప్ హెచ్చరికలేనని చెప్పవచ్చు. ఒకవేళ ట్రంప్ నిజంగానే పాక్ మీద నిషేధం విదించి దానికి ఏటా చెల్లించే లక్షల కోట్ల డాలర్లు ఇవ్వడం నిలిపివేస్తే అప్పుడు పాక్ తన అసలు రూపం తప్పక ప్రదర్శిస్తుంది. పాక్ శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ నేటికీ పాక్ ఉగ్రవాదులు కాశ్మీర్ లో ప్రవేశిస్తూనే ఉన్నారు. వారు మన భద్రతాదళాలపై దొంగచాటుగా జరుపుతున్న కాల్పులలో రోజూ ఒకరిద్దరో జవాన్లు చనిపోతూనే ఉన్నారు. వారితో మన భద్రతాదళాలు రోజూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. కనుక పాక్ వక్రబుద్ధి మారుతుందని ఆశించడం కష్టమే.


Related Post