అచ్చం బాబులాగే...

January 24, 2017


img

ఒకప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన తెదేపాలో ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను చంద్రబాబు నాయుడు తనవైపు తిప్పుకొని పార్టీని మావగారి చేతిలో నుంచి గుంజుకొన్నట్లుగానే, యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీని స్థాపించి బలోపేతం చేసిన మూలాయం సింగ్ చేతిలో నుండి ఇప్పుడు అయన కుమారుడు అఖిలేష్ యాదవ్ బలవంతంగా గుంజుకొన్నారు. వారిరువురి మద్య జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ తెదేపాలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నాయి.

అఖిలేష్ యాదవ్ తన తండ్రిని పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా దించేసి తనే ఆ పదవి చేపట్టారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు తన తండ్రిని అదేవిధంగా గౌరవిస్తున్నారు. తండ్రి చేతిలో నుంచి బలవంతంగా పార్టీను గుంజుకొన్నప్పటికీ అయనే తమ పార్టీ ప్రధాన ఎన్నికల ప్రచారకర్తగా ప్రకటించడం విశేషం. 

ఒకప్పుడు ఎన్టీర్ తన అల్లుడు చంద్రబాబు తనను మోసం చేశాడంటూ ఏవిధంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారో, ఇప్పుడు ములాయం సింగ్ కూడా తన కొడుకు పట్ల అదే విధంగా సరిగ్గా అవే కారణాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక  ఆయన కొడుకు కోసం ప్రచారంలో పాల్గొనకపోవచ్చు. కానీ ఆయన ప్రచారానికి వస్తారనే ఉద్దేశ్యంతో అఖిలేష్ అయన పేరు జాబితాలో చేర్చలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లుగా తండ్రి పట్ల రాష్ట్ర ప్రజలకు ఉన్న గౌరవాభిమానాలను ఓట్ల రూపంలో మార్చుకోవాలనే ఆశతోనే అయన పేరు వాడుకొంటున్నట్లు చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పార్టీలో తండ్రీకొడుకుల మద్య జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ అచ్చం తెదేపాలో జరిగినట్లే సాగుతుండటం చాలా విశేషం. 


Related Post