అమ్మలకు నాన్నలా రక్షణ...

January 17, 2017


img

 ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చేసుకొని పాలన సాగిస్తుంటుంది. కానీ దానికి మానవీయత కూడా జోడించినప్పుడే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెరాస సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు కూడా ఆ కోవకే చెందుతాయి. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేద గర్భిణి స్త్రీలకు ఏదో ఒక సంక్షేమ పధకాన్ని అమలుచేస్తూనే ఉన్నాయి. కానీ వాటి అమలులో చిత్తశుద్ధి, మానవత దృక్పధం లోపించడం వలన అర్హులకు ఆ ఫలాలు చేరడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వాలకు ఆశించిన మంచి పేరు రావడం లేదు. ఇటువంటి ప్రతికూల అంశాలను అన్నిటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉంచుకొని, ఏ సంక్షేమ పధకం ప్రవేశపెట్టాలనుకొన్నా ముందుగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో దానిని ఏవిధంగా అమలుచేస్తున్నారో, దానిలో లోటుపాట్లు ఏమిటో అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడం ఆనవాయితీగా చేసుకొన్నారు. అ తరువాతే పధకాలను ప్రకటించి వాటిని పకడ్బందీగా అమలుచేస్తుంటారు. 

పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం గర్బిణి స్త్రీలకు అత్యుత్తమ పధకాలను రూపొందించి అమలుచేస్తున్న సంగతి తెలుసుకొన్న కేసీఆర్ అక్కడికి సంబంధిత మంత్రులు, అధికారులను పంపించి ఆ వివరాలు సేకరించి, దానికంటే మెరుగైన పధకాన్ని రూపొందించారు. ఈ పధకానికి ఇంకా పేరు ఖరారు చేయనప్పటికీ అది ఏవిధంగా ఉండబోతోందనే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మా రెడ్డి స్పష్టత ఇచ్చారు. దానిలో ముఖ్యాంశాలు.

1. తమిళనాడు ప్రభుత్వం గర్బిణి స్త్రీలకు ప్రసవం ఖర్చుల నిమిత్తం రూ.12,000 ఇస్తోంది. తెలంగాణా ప్రభుత్వం రూ.15,000 మూడు వాయిదాలలో ఇవ్వాలని నిశ్చయించింది.

2. ప్రభుత్వ దవాఖానాలలో సుఖ ప్రసవాలు జరిపిన వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

3. కొత్తగా పుట్టిన బిడ్డలకు అవసరమైన ప్రభుత్వ పాల సీసా, బేబీ పౌడర్, నూనె, సబ్బు, దోమతెర, చిన్న పరుపు వంటి 30 వస్తువులతో కూడిన ఒక బేబీ కిట్ ను ప్రసవం అనంతరం తల్లులకు అందజేయాలని నిశ్చయించారు. అప్పుడే రెండవ వాయిదా క్రింద రూ.5,000 కూడా తల్లులకు అందిస్తారు. మళ్ళీ బిడ్డకు టీకాలు వేయించడానికి తీసుకువచ్చినప్పుడు మిగిలిన రూ.5,000 కూడా ఇస్తారు. 

4. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా “అమ్మ ఒడి” వాహన సేవలను ప్రారంభించబోతున్నారు.

5. ప్రతీ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ దవాఖనాలలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లను ఏర్పాటు చేయాలని,  నిశ్చయించారు.   

6. జిల్లా కేంద్రాలలో ఆసుపత్రులలో సేవలు మెరుగు పరిచేందుకు వీలుగా 2118 వైద్య, పారా మెడికల్ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు. 


Related Post