మరీ ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా?

January 16, 2017


img

కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకోసమే ఉందని చాటి చెప్పుకోవడానికి రాహుల్ గాంధీ ఇవ్వాళ్ళ చాలా చీప్ ట్రిక్ ప్రదర్శించారు. ఈరోజు ఉత్తరాఖండ్ లో రిషికేశ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడీ ఖరీదైన సూట్లు ధరించి, బాగా డబ్బున్న వారితో రాసుకు పూసుకు తిరుగుతుంటారు. ఆయన వారి కోసమే పని చేస్తున్నారు,” అని రాహుల్ విమర్శించారు. 

ఆయన విమర్శలో నిజానిజాలను ప్రజలే నిర్ణయించుకొంటారు. కానీ తమను ఆకట్టుకోవడానికి రాహుల్ గాంధీ చేసిన చీప్ ట్రిక్ చూసి వారు నివ్వెరపోయారు. రాహుల్ గాంధీ తన చిరిగినా చొక్కాను వారికి చూపిస్తూ, “నా చొక్కా చిరిగిపోవడం మీరు చూడగలరేమో కానీ మోడీ ధరించే సూటు చిరిగిపోవడం ఎన్నడూ చూడలేరు. ఎందుకంటే అయన ఖరీదైన సూట్లు ధరించి ధనికులతో తిరుగుతుంటారు. నేను ఎప్పుడూ మీ మద్యనే ఉంటాను. అందుకే నేను ధరించే బట్టలు కూడా ఇలాగే ఉంటాయి,” అని అన్నారు. 

రాహుల్ గాంధీ తీరు చూస్తే ప్రజలను ఆకట్టుకోవడానికే తన చొక్కా చింపుకొన్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ పొరపాటున చిరిగిపోయినా వెంటనే మార్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఒకవేళ మార్చుకోకూడదనుకొన్నా తన చిరిగిన చొక్కాను ప్రజలకి ప్రదర్శించుకోనవసరం లేదుకదా? మోడీకి ఖరీదైన సూట్లు ధరించి ధనికులతో రాసుకుపూసుకు తిరగడం ఇష్టమయితే, రాహుల్ గాంధీ ఆ విషయం గురించి మాట్లాడితే సరిపోయేది కానీ వేదికలెక్కి తన చిరిగిన చొక్కాను ప్రజలు చూపించి ఓట్లు అడుక్కోనవసరం లేదు కదా?ఇటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి శల్యసారద్యం చేస్తుంటే దాని భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో?  


Related Post