నెహ్రూ కుటుంబంలో తెలివితక్కువవాడు ఎవరంటే..

January 13, 2017


img

మాజీ ప్రధానులు నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ పట్ల చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వారిరువురి పట్ల దేశ ప్రజలలో అపారమైన గౌరవం ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే. వారి తరువాత దేశాన్ని పాలించిన రాజీవ్ గాంధీ కూడా వారంత గొప్ప పేరు సంపాదించుకోలేకపోయినా పరువాలేదనిపించుకొన్నారు.

అయన హటాన్మరణంతో వారి వంశపాలనకు బ్రేకులు పడినట్లయింది. ఆయన భార్య హోదాలో సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సిద్దపడినప్పటికీ ఆమె విదేశీమూలాల కారణంగా పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. దానికే కాంగ్రెస్ పార్టీ ‘త్యాగం’ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొంది. అయితే ఆ త్యాగమయి ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోలేకపోయినప్పటికీ, తన కనుసైగలతో నడుచుకొనే డా.మన్మోహన్ సింగ్ ను దానిలో కూర్చోబెట్టి రిమోట్ పద్ధతిలో దేశాన్ని పాలించి తన ముచ్చట తీర్చుకొన్నారు. ఆమె ముచ్చటకి దేశం చాలా బారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. అది వేరేసంగతి. ఆమె చేసిన బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసినప్పటికీ, ఆమె కూడా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగలరని నిరూపించుకొన్నారు. 

ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రధాన మంత్రి కుర్చీలో 10 ఏళ్ళ పాటు రుమాలు వేసి ఉంచినా అతను దానిలో కూర్చొనే సాహసం చేయలేకపోయారు. పార్టీలో అందరూ ధైర్యం చెపితే తెగించి దానిలో కూర్చోవడానికి సిద్దపడ్డారు కానీ అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. 

పార్టీ అధ్యక్ష పదవినైనా చేపడదామనుకొంటే ‘నీకు అంత సీను లేదని’ పార్టీలో వారే అనేయడం రాహుల్ చాలా హర్ట్ అయిపోయి విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే ఆయన ‘నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం ఎలా?” అనే రెండు నెలల రేపిడ్ కోర్సులో శిక్షణ పొందినట్లు మీడియాలో చాలా జోకులు వినిపించాయి. ఆయనని పార్టీ పెద్దలు చాలా బ్రతిమాలాడి తీసుకువచ్చాక తను విదేశాలలో నేర్చుకొన్న ఆ కోర్సులోని పాఠాలను అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

 అయితే దేశంలో జరుగుతున్న అన్ని విషయలపై ఏవిధంగా స్పందించాలనే వివరాలు ఆ పాఠాలలో ఉండవు కనుక రాహుల్ గాంధీ కొంచెం తడబడుతున్నారు. 

నోట్ల రద్దు గురించి కూడా వాటిలో లేకపోవడం వలన రాహుల్ గాంధీ తన స్వంత తెలివితేటలు ఉపయోగించి దానికి ఒక గొప్ప పరిష్కారం చూపారు. అదే..దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి “అచ్చే దిన్” ఇస్టార్ట్ అయిపోతాయని చెపుతున్నారు. మోడీ దేశానికి రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారనే సంగతి రాహుల్ గాంధీ కనిపెట్టి చెప్పేశారు.

సహజంగానే అయన అభిప్రాయంతో భాజపా, ఆర్ఎస్.ఎస్.లు ఏకీభవించలేదు. అయినా పరువాలేదు కానీ గాంధీ-నెహ్రు కుటుంబంలో రాహుల్ గాంధీయే అందరి కంటే తెలివి తక్కువవాడు...లోకజ్ఞానం లేనివాడని తేల్చి పడేసాయి. రాహుల్ గాంధీకి వారి అంత తెలివితేటలు, శక్తిసామర్ధ్యాలు లేకపోయినా కనీసం మన దేశ చరిత్ర గురించి, వర్తమాన రాజకీయాలపై అవగాహన కూడా లేదని ఆర్ఎస్.ఎస్. నేత రాకేశ్ సిన్హా తేల్చి పడేశారు. ఇక వెంకయ్య నాయుడయితే మరీను.. కాంగ్రెస్ పార్టీ 2019కి కాదు కదా 2090కి కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదని జోస్యం చెప్పారు. మరి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు అవుతాడు..దేశానికి అచ్చే దిన్ ఎప్పుడు తెస్తాడు? 


Related Post