బాబు, పవన్ భలే దోస్తులు

January 07, 2017


img

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపి సర్కార్ పై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సిఎం చంద్రబాబు దానిని చాల లైట్ తీసుకొంటుంటారు. ఆయన లైట్ తీసుకొంటారు గాబట్టే మంచి నోరున్న తెదేపా నేతలందరూ బలవంతంగా నోళ్ళు కట్టేసుకోవలసివస్తోంది. అదే..జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చిత్తూరులో ముద్దు కృష్ణంనాయుడు మొదలు శ్రీకాకుళంలో అచ్చెం నాయుడు వరకు తెదేపా నేతలు అందరూ తమ నోటి పవర్ ఏమిటో చూపుతుంటారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ భాదితుల సమస్యలపై తెదేపా ప్రభుత్వానికి గట్టిగా చురకలు, హెచ్చరికలు చేసి డెడ్-లైన్లు కూడా పెట్టినా బాబు లైట్ తీసుకొన్నారు. లైట్ అంటే మరీ లైట్ కాదు వాటికీ తగినంత వెయిట్ కూడా ఇచ్చారు. తక్షణమే ఆరోగ్యం మంత్రిని శ్రీకాకుళం పరిగెత్తించారు. మరునాడు తను కూడా జిల్లాలో చైతన్యయాత్ర పెట్టుకొని వెళ్ళి ఉద్దానం కిడ్నీ బాధితులకోసం ప్రపంచంలో నిపుణులు అందరినీ జిల్లాలో డంప్ చేసి..అదే..రప్పించేసి మూడు దశాబ్దాల సమస్యను వీలైనంత త్వరగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చేశారు. దానితో పవన్ కళ్యాణ్ కుష్ అయిపోయారు. చంద్రబాబుకి తను పెట్టిన 48 గంటలలో రూ.100 కోట్లు విడుదల, డెడ్ లైన్లు వగైరా అన్ని మరిచి బాబుకి థాంక్స్ చెప్పి ఆయన గ్రహింపు శక్తికి జోహార్లు అర్పించారు కూడా. ఇదంతా చూసి దటీజ్ పవన్ కళ్యాణ్ అనుకోవాలో లేక దటీజ్ బాబు అనుకోవాలో తెలియక జనాలు బుర్ర గోక్కొంటున్నారు.


Related Post