తమిళనాడులో వారసులొచ్చారు

January 04, 2017


img

తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఇంచుమించు ఒకేసమయంలో వారసులు పగ్గాలు చేపడుతుండటం విశేషం. అధికార అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను శశికళ చేపట్టగా, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె పార్టీలో కూడా బుదవారం అధికార బదిలీ ప్రక్రియ పూర్తయింది. ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి (94) వృదాప్యంకారణంగా పార్టీని నడుపలేని స్థితిలో ఉన్నందున, ఈరోజు చెన్నైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో కరుణానిధి రెండవ కుమారుడు స్టాలిన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికొన్నారు. దీనితో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటిలో ఒకేసారి వారసుల చేతిలోకి పగ్గాలు వచ్చాయి. 

అధికార అన్నాడిఎంకె పార్టీలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాలు అధికారం కోసం కుమ్ములాడుకొంటుంటే, మరోపక్క స్వర్గీయ జయలలిత మేనకోడలు దీపా జయరామన్ న్ని ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించేందుకు అన్నాడిఎంకె పార్టీలో ఒకవర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఆమె కూడా ఆసక్తి చూపిస్తోంది కానీ తను రాజకీయాలలోకి రావడానికి మరికొంత సమయం అవసరమని చెపుతున్నారు.  

 ఇక కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి డిఎంకెలో నుంచి బయటకు వెళ్ళిపోవడంతో స్టాలిన్ కే పార్టీ పగ్గాలు దక్కాయి. అతని సోదరి, ఎంపి కనిమొళి కీలకమైన ఈ సమావేశానికి హాజరుకాలేదు. కనుక ఆమె స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారా లేదో చూడాలి. ఒకవేళ స్టాలిన్ చురుకుగా పావులు కదిపి అన్నాడిఎంకె పార్టీ చేతిలో నుంచి అధికారం చేజిక్కించుకోగలిగితే ఇక ఆయనకు తిరుగుఉండదు. 


Related Post