గ్రేటర్ ఫలితాలు...టిఆర్ఎస్‌కు తేరుకోలేని షాక్

December 04, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ కనీసం 65-75 స్థానాలు గెలుచుకొని సొంతంగానే మేయర్ పదవి దక్కించుకొంటుందని భావిస్తే కేవలం 55 సీట్లు గెలుచుకొని ఘోరపరాజయం పాలైంది. బిజెపి 25-38 డివిజన్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా 44 స్థానాలు గెలుచుకొని అంచనాలను తారుమారు చేయడమే కాక టిఆర్ఎస్‌కు అధికారాన్ని దూరం చేసింది. ఇక మజ్లీస్‌ పార్టీ 51 స్థానాలకు పోటీ చేసి 44 స్థానాలను గెలుచుకొంది. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తలెత్తుకోలేని దయనీయ పరిస్థితులు దాపురించాయి. 149 డివిజన్‌లకు పోటీ చేసి కేవలం రెండే గెలుచుకోవడంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి సొంతంగా జీహెచ్‌ఎంసీ పీఠం దక్కించుకొనేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ ధాటిని తట్టుకొనేందుకు బహుశః టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు మళ్ళీ చేతులు కలుపువచ్చు.


Related Post