మోడీ దెబ్బకు చైనా విలవిల

November 24, 2020


img

భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై గత  ఆరేడు నెలలుగా ఇరుదేశాల మద్య ఉన్నతస్థాయిలో సమావేశాలు, చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోగా సరిహద్దుల వద్ద భారీగా ఆయుధాలు నిలువచేసేందుకు వీలుగా బంకర్లు కూడా నిర్మిస్తోంది. తద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచాలని చైనా భావిస్తే, ఆ దేశానికి భారత్‌ ఇవాళ్ళ మరో షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన మరో 43 మొబైల్ యాప్‌లను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. వాటి ద్వారా భారతీయులకు సంబందించిన వ్యక్తిగత సమాచారం చైనాకు చేరే అవకాశం ఉన్నందున దేశ సమగ్రత, భద్రతలను దృష్టిలో పెట్టుకొని వాటిపై నిషేదం విధిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్‌ ఇప్పటివరకు మొత్తం 221 చైనా మొబైల్ యాప్‌లపై నిషేధం విధించినట్లయింది.  

భారత్‌-చైనాల మద్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చైనా దిగుమతులపై కూడా భారత్‌ ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. దీపావళి పండుగకు చైనా నుంచి దిగుమతయ్యే బాణాసంచా నిలిపివేయడంతో, భారత్‌లోని బాణాసంచా తయారుచేసే చిన్నా పెద్ద పరిశ్రమలకు సుమారు రూ.40,000 కోట్లు ఆదాయం లభించినట్లు సమాచారం. ఆ మేరకు చైనా నష్టపోయింది. చైనాతో సమస్య మొదలైనప్పటి నుంచి ‘దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని’ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పలుమార్లు దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తునే ఉన్నారు. అలాగే ఈ సమస్య మొదలవక మునుపే కేంద్రప్రభుత్వం ‘మేక్ ఇన్‌ ఇండియా’ విధానం ద్వారా దేశీయ సంస్థలను, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గట్టిగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 

సరిహద్దుల సైన్యాన్ని మోహరించి, ఆయుధాలు పోగుచేసి భారత్‌పై ఒత్తిడి పెంచడం ద్వారా చైనా ఉత్పత్తులపై ఆంక్షలు సడలింపజేయాలని చైనా భావిస్తుంటే, ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో, విధానాలతో ఓ పక్క భారతీయ పరిశ్రమలను చేయూత నిస్తూనే చైనా ఆర్ధికమూలాలను దెబ్బ తీస్తూ చాలా నిబ్బరంగా ముందుకు సాగిపోతోంది  భారత్‌. 

ఏది ఏమైనప్పటికీ భారత్‌తో చైనా కయ్యానికి కాలుదువ్వుతుండటం వలన మళ్ళీ చాలా దశాబ్ధాల తరువాత స్వదేశీ  పరిశ్రమలకు, స్వదేశీ ఉత్పత్తులకు మంచిరోజులు మొదలవడం చాలా సంతోషకరమైన విషయమే. 

తాజాగా నిషేదించబడిన చైనా మొబైల్ యాప్స్ వివరాలు: 

         


Related Post