మజ్లీస్‌తో దోస్తీ మాత్రమే పొత్తులు లేవు: కేటీఆర్‌

November 19, 2020


img

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం మధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ డ్‌ ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. 

“జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిస్తే ఈసారి మజ్లీస్‌ పార్టీకి మేయర్ పదవి ఇవ్వబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి?” అని ఓ విలేఖరి ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెపుతూ, “మజ్లీస్‌తో మాకు దోస్తీ మాత్రమే ఉంది. ఎటువంటి పొత్తులు లేవు. కనుక 150 స్థానాలలో పోటీ చేస్తున్నాము. మేము  100 సీట్లు గెలుచుకొంటే మేయర్ పదవి మేమే తీసుకొంటాము కానీ మా కంటే తక్కువ సీట్లున్న మజ్లీస్‌కు ఎందుకు ఇస్తాము? ఈసారి మేయర్ పదవి టిఆర్ఎస్‌కు చెందిన మహిళకే దక్కబోతోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు,” అని అన్నారు. Related Post