హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలో సిటీ బస్సులు షురూ

September 23, 2020


img

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, బండ్లగూడ ప్రాంతాలలో నేటి నుంచి సిటీ బస్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఒక్కో డిపో నుంచి 12 బస్సులు చొప్పున ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. కానీ హైదరాబాద్‌ నగరంలో కరోనా తీవ్రత ఇంకా ఎక్కువగా ఉన్నందున నగరం లోపల మాత్రం ఇంకా సిటీ బస్సులు నడిపించడం లేదు. నగరు శివారు ప్రాంతాలలో సిటీబస్సులను ప్రజలు వినియోగించుకొంటే, సిటీబస్సుల ద్వారా కరోనా వ్యాపించకపోతే నగరంలో కూడా సిటీ బస్సులు నడిపించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో దూరప్రాంతాల బస్సులు యధాప్రకారం నడుస్తున్నాయి. 

ఏపీలో కూడా ఇటీవలే సిటీ బస్సులు ప్రారంభం అయ్యాయి. జిల్లాల మద్య తిరిగే దూరప్రాంత బస్సులలో ఇక నుంచి భౌతికదూరం పాటించకుండా పూర్తి సామర్ధ్యంతో బస్సులు నడిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బస్సులలో భౌతికదూరం పాటించేందుకుగాను ఒక్కో సీటుకు ఒక్కో ప్రయాణికుడిని మాత్రమే అనుమతిస్తుండటం వలన ఏపీఎస్ ఆర్టీసీకి నష్టపోతున్నందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. 


Related Post