తొలిసారిగా యుద్ధనౌకలలో ఇద్దరు మహిళా అధికారులు

September 21, 2020


img

భారత్‌ త్రివిద దళాలలో అన్ని స్థాయి, హోదాలలో మహిళలు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మహిళా అధికారులకు ఉండే కొన్ని ప్రత్యేక ఇబ్బందుల కారణంగా ఇంతకాలం భారత్‌ నావికాదళంలో యుద్దనౌకలలో ఎవరినీ నియమించలేదు. కానీ మొట్టమొదటిసారిగా లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్‌లకు ఆ అవకాశం లభించింది. వారిరువురికీ యుద్ధనౌకలలో ఉండే అత్యాధునికమైన ఎంహెచ్-60 ఆర్‌ హెలికాఫ్టర్లను నడుపబోతున్నారు. వారు హెలికాఫ్టర్లను నడపడంతో పాటు, నిఘా, సెన్సార్ ఆపరేటింగ్ తదితర విధులను నిర్వర్తించనున్నారు.      



Related Post