వ్యవసాయబిల్లును కూడా వ్యతిరేకిస్తాం: కేసీఆర్‌

September 19, 2020


img

కేంద్రప్రభుత్వం తెస్తున్నా వ్యవసాయబిల్లులను టిఆర్ఎస్‌ వ్యతిరేకిస్తుందని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థను తొలగింది రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే ఆ రెండు బిల్లులను తెచ్చామని కేంద్రప్రభుత్వం చెప్పుకొంటోందని, కానీ అది తేనె పూసిన కత్తివంటిదని సిఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా...ఎవరికైనా అమ్ముకోవచ్చని వ్యవసాయ బిల్లులో ఉందని కానీ అది ఎలా సాధ్యమని సిఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. జిల్లా కేంద్రాలలో మార్కెట్ యార్డుకు తమ ఉత్పత్తులను తెచ్చేందుకే ఇబ్బందులు పడుతున్న రైతులు, దేశంలో వేరే రాష్ట్రాలకు ఏవిధంగా తరలించగలరని సిఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. రైతులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకొనే స్థోమత ఉండదు కనుక కార్పొరేట్ కంపెనీలు రైతులపై పడి దోచుకొనేందుకు ఈ వ్యవసాయ బిల్లులు మార్గం ఏర్పరచుతున్నాయని సిఎం కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగించే ఈ బిల్లులను పార్లమెంటులో అడ్డుకోవాలని సిఎం కేసీఆర్‌ తమ ఎంపీలకు సూచించారు. 


Related Post