కొత్త సచివాలయం డిజైన్, నిర్మాణానికి కేబినెట్ ఆమోదముద్ర

August 06, 2020


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుదవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయం డిజైన్, నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. కొత్త సచివాలయాన్ని మొదట ఆరు అంతస్తులలో నిర్మించాలనుకొన్నప్పటికీ సిఎం కేసీఆర్‌ సూచన మేరకు ఏడంతస్తులతో నిర్మించాలని నిర్ణయించారు. ఏడవ అంతస్తులో సిఎం కార్యాలయం ఉంటుంది. సుమారు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే  కొత్త సచివాలయానికి చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ అందించింది. మంత్రివర్గం ఆమోదం తెలిపింది కనుక అతి త్వరలోనే కొత్త సచివాలయం నిర్మాణ పనులు మొదలవనున్నాయి.  

కొత్త సచివాలయం వివరాలు: 

విస్తీర్ణం: 27.5 ఎకరాలు

భవనం, ఇతర వసతుల కోసం వినియోగించే స్థలం: 23.5 ఎకరాలు 

ల్యాండ్ స్కేపింగ్: 12 ఎకరాలు

అంతర్గత రోడ్లు: 6 ఎకరాలు

పార్కింగ్ : 3.7 ఎకరాలు 

పచ్చిక బయలు: 2.2 ఎకరాలు     

సచివాలయం కొలతలు, వివరాలు: 

భవనం పొడవు, వెడల్పు: 600X300 అడుగులు 

భూమి నుంచి జాతీయ చిహ్నం వరకు ఎత్తు: 278 అడుగులు. 

మొత్తం అంతస్తులు: ఏడు+ లాబీలు

మద్యలో ఉండే టవర్‌లో సమావేశ మందిరాలు, స్కై లాంజ్ విస్తీర్ణం: 52,000 చదరపు అడుగులు 

మొత్తం విస్తీర్ణం: 2.4 ఎకరాలలో 7 లక్షల చదరపు అడుగులు. 


Related Post