విశాఖ షిప్‌యార్డులో కూలిన భారీ క్రేన్

August 01, 2020


img

విశాఖనగరంలో గల హిందూస్థాన్ షిప్‌యార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ ఈరోజు ఉదయం హటాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ ప్రదేశంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు దాని క్రింద నలిగి చనిపోయారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దేశవిదేశాల నుంచి వచ్చే సరుకు రవాణా షిప్పులలో నుంచి భారీ కంటెయినర్లు వగైరాలను ఈ క్రేన్‌తోనే అన్‌లోడ్‌ చేస్తుంటారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ క్రేన్‌ ట్రయల్ రన్‌లో భాగంగా ఒడ్డున లంగరు వేసిన షిప్పులో నుంచి సరుకు అన్‌లోడింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.        Related Post